Monday, January 20, 2025

ఆర్టీసి బస్సు ,ఆటో ఢీ..ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భవాని మాలధారులు దుర్మరణం పాలైన సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం మణుగూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ ఆర్టిసి బస్సు హైదరాబాద్ నుండి మణుగూరు వెళ్తుండగా, కొత్తగూడెం నుండి ఖమ్మం వైపు వెళ్తున్న ఆటోను ఎదురెదురుగా ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్నఇద్దరు భవాని మాలధారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. మృతి చెందిన వారిది పాల్వంచ మండలం జగన్నాధపురంకి చెందిన బానోత్ సంతోష్, గూగులోత్ మనోహర్‌గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జూలూరుపాడు సర్కిల్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాణా ప్రతాప్ ఘటనకు గల కారణాలను సేకరించి, మృతదేహాలను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News