Wednesday, January 22, 2025

చెన్నై శివారులో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు క్రిమినల్స్ మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై శివారులోని గుడువాంచెరి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు క్రిమినల్స్ మరణించారు. ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ నేతృత్వంలోని పోలీసు బృందం వెహికల్ చెక్ డ్యూటీలో ఉండగా, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో బ్లాక్ స్కోడా కారులో అక్కడికి వచ్చిన నలుగురు నిందితులు.. పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో సబ్-ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌ స్వల్ంగా గాయపడగా, ఇద్దరు నిందితులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. గాయపడిన నిందితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు నిందితులు మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News