Monday, December 23, 2024

జోగులాంబలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

జోగులాంబ గద్వాల: జిల్లాలోని ఇటిక్యాల మండలం బీచుపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం బీచుపల్లిలో చోటుచేసుకుంది. టాటా ఏస్ వాహనం టైర్ మారుస్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన ముత్తరాజు, సంతుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News