- Advertisement -
ముంబై: మహారాష్ట్రలోని జల్నా సమీపాన చందన్ జిరా వద్ద సమృద్ధి హైవేపై కారును కంటైనర్ ఢీకొని ఇద్దరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పారిపోడానికి ప్రయత్నించిన కంటైనర్ డ్రైవర్‌ను పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -