Sunday, December 22, 2024

నాగర్ కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

2 Killed in Road Accident in Nagarkurnool

నాగర్ కర్నూల్: జిల్లాలోని తెలకపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున మండలంలోని అనంతసాగర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో శ్రీశైలం వెళ్తున్న భక్తులు ఇద్దరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. డ్రైవర్ రామ కృష్ణ ఘటనా స్థలంలోనే మృతి చెందగా మణెమ్మ అనే ఓ మహిళ మృతి చెందింది. మృతులు వికారాబాద్ జిల్లా యాలాల మండలం గుంటుపల్లికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

2 Killed in Road Accident in Nagarkurnool

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News