Sunday, April 27, 2025

నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

2 killed in Road Accident in Nizamabad

నిజామాబాద్: జిల్లాలోని వేల్పూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం బండలంలోని లక్కోర జాతీయ రహదారిపై ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని కమ్మర్ పల్లి మండలంలోని నాగపూర్ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

2 killed in Road Accident in Nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News