Thursday, January 23, 2025

వ‌న‌స్థ‌లిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

2 Killed in Road Accident in Vanasthalipuram

హైద‌రాబాద్: నగరంలోని వ‌న‌స్థ‌లిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమ‌వారం అర్ధ‌రాత్రి వనస్థలిపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఇంజాపూర్ వ‌ద్ద రెండు బైకులు ఒక‌దానికొక‌టి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రు యువ‌కులకు తీవ్ర గాయ‌లయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

2 Killed in Road Accident in Vanasthalipuram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News