Friday, December 27, 2024

సెయింట్ లూయీ స్కూలులో ఉన్మాది కాల్పులు

- Advertisement -
- Advertisement -

2 killed in St. Louis school shooting

ఇద్దరి మృతి.. ఆరుగురికి గాయాలు

సెయింట్ లూయీ(అమెరికా): సెయింట్ లూయీలోని సెంట్రల్ విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ హైస్కూలులో సోమవారం ఉదయం ఒక సాయుధుడు విచాక్షణారహితంగా జరిపిన కాల్పులలో ఒక ఉపాధ్యాయురాలితోపాటు ఒక బాలిక మరణించగా ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో స్కూలులోకి చొరబడిన గుర్తు తెలియని సాయుధుడు కాల్పులు ప్రారంభించడంతో ప్రాణభయంతో విద్యార్థులు తరగతి గదుల్లోకి పరుగులు తీసి బల్లల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. సాయుధుడు తనపై తుపాకీ గురిపెట్టాడని, అయితే అది జామ్ కావడంతో తాను పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నానని భయంతో వణుకుతూ ఒక బాలిక తెలిపింది. సకాలంలో స్కూలు భద్రతా సిబ్బంది, పోలీసులు స్పందించి ఎదురుకాల్పులు జరపడంతో ఆ సాయుధుడు అక్కడికక్కడే మరణించాడని, 20 సంవత్సరాల వయసున్న ఆ వ్యక్తి వివరాలు ఇంకా తెలియరావలసి ఉందని పోలీసు చీఫ్ మైఖేల్ శాక్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News