- Advertisement -
కట్ని(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లా స్లీమనాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కూలిపోయి ఇద్దరు కార్మికులు మరణించగా ఏడుగురు కార్మికులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. మృతుల దేహాలను సహాయకులు వెలికితీసినట్లు అదనపు ఎస్‌పి మనోజ్ కేడియా తెలిపారు. కూలిపోయిన సొరంగంలో చిక్కుకుపోయిన ఏడుగురు కార్మికులను రక్షించిన సహాయకులు వారిని 30 కిలోమీటర్ల దూరంలోని కట్ని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎఎస్‌పి తెలిపారు. బర్గి డ్యాం కెనాల్ ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న సొరంగం కూలిపోగా 9 మంది కార్మికులు అందులో చిక్కుకు పోయారని ఆయన చెప్పారు.
- Advertisement -