Thursday, January 23, 2025

మహారాష్ట్రలో మూడోవారం వరకల్లా 2 లక్షల యాక్టివ్ కేసులు: ఆ రాష్ట్ర అధికారి అంచనా

- Advertisement -
- Advertisement -

2 lakh active cases in Maharashtra till third week

ముంబయి: మహారాష్ట్రలో జనవరి మూడోవారం వరకల్లా కొవిడ్19 యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరుతుందని ఆ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రదీప్‌వ్యాస్ అంచనా వేశారు. వీరిలో కొందరిని ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందించాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు కేసులు పెరుగుతున్నతీరును బట్టి ఈ అంచనా వేశామన్నారు. కేసుల పెరుగుదలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక ఆదేశాలిస్తామన్నారు. ఒమిక్రాన్ వల్ల వచ్చే మూడో ఉధృతి స్వల్ప లక్షణాలతోనే ఉంటుందని, ప్రమాదమేమీ ఉండబోదంటూ నిర్లక్షం వహించొద్దని వ్యాస్ సూచించారు. ఇప్పటికే మహారాష్ట్రలో బహిరంగ సమావేశాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆదివారం ఉదయం వరకల్లా 24 గంటల్లో మహారాష్ట్రలో 11,877 కేసులు, 9 మరణాలు సంభవించాయి. దేశంలోనే ప్రస్తుతం అత్యధిక కేసులు నమోదవుతున్నది ఈ రాష్ట్రంలోనే అన్నది గమనార్హం. ఒమిక్రాన్ కేసుల్లోనూ ఆ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నది. ఇప్పటికే 500కుపైగా ఒమిక్రాన్ కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News