Sunday, December 22, 2024

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

2 Lashkar-e-Taiba Terrorists killed in Srinagar

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. శ్రీనగర నగర్‌లోని  జకురా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు శనివారం ఉదయం ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు చనిపోయినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఘటనాస్థలం నుంచి పేలుడు పదార్థాలు, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

2 Lashkar-e-Taiba Terrorists killed in Srinagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News