ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
గమనించి ఇద్దరు వ్యక్తులకు దేహశుద్ధి చేసిన స్థానికులు
వికారాబాద్ జిల్లా తాండూర్లో ఘటన
మన తెలంగాణ/తాండూరు: అబం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి ఇద్దరిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధ్ది చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఇందిరానగర్లో హమాలి బస్తికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిపై అదే కాలనీకి చెందిన అంజి, నర్సింలు ఇద్దరు కలిసి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. చిన్నారి నోట్లో గుడ్డ కుక్కి ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి అరుపులు కేకలు వినిపించడంతో స్థానికులు ఇద్దరిని పట్టుకుని కరెంటు స్తంబానికి కట్టేసి కొట్టారు. అబం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరి నిందితులను తాండూరు పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ గిరి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిపై అఘాతయిత్యానికి పాల్పడిన ఇద్దరిని కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
2 men arrested for 8 years old girl raped in Vikarabad