Sunday, January 19, 2025

ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

కుమురంభీంః జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కౌటాల మండలంలోని వైగాం వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు మృతి చెందారు. విద్యుత్ స్తంభాలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను ముంజంపల్లికి చెందిన వసంత్(33), అనిల్(32)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News