Wednesday, January 22, 2025

గోడ దూకి షారుఖ్ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డారు..

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: గుజరాత్‌కు చెందిన ఇద్దరు యువకులు ప్రహరి గోడ దూకి బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ ఇంట్లోకి చొరపడేందుకు ప్రయత్నించారు. ముంబైలోని షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్‌లోకి ప్రయత్నించిన ఆ ఇద్దరు గుజరాతీ యువకులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. 19, 20 సంవత్సరాలు ఉన్న ఇద్దరు యువకులు గుజరాత్ నుంచి ముంబైకి వచ్చారు. షారుఖ్ ఖాన్‌ను చూసేందుకే తాము ఎత్తయిన ప్రహరీ గోడ దూకామని ఆ ఇద్దరు యువకులు పోలీసులకు తెలిపారు. ఈ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News