బ్యూనస్ ఐరిస్: అర్జెంటీనాలో రెండు మంకీపాక్స్ కేసులు నమోదు అయినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇటీవలే స్పెయిన్ నుంచి వచ్చిన వ్యక్తి ఆరోగ్యం క్షీణించడంతో పరీక్షల క్రమంలో మంకీపాక్స్ ఉన్నట్లు నిర్థారించారు. అమెరికా , యూరప్ ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లలో తొలుత ఈ వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. లాటిన్ అమెరికా ఈ వైరస్‌కు గురి అయినట్లు తొలిసారిగా నిర్థారణ అయింది. బ్యూనస్ ఐరిస్‌కు చెందిన వ్యక్తి ఇటీవలే స్పెయిన్‌కు వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని వచ్చిన తరువాత మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లుగా తేలడంతో దేశంలో ఇది రెండో మంకీపాక్స్ కేసుగా మారింది. అంతకు ముందు స్పెయిన్ వ్యక్తి ఒకరు అర్జెంటీనాకు వచ్చారు. మంకీపాక్స్ వైరస్ నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. అత్యంత అరుదైన వైరస్‌గా మంకీపాక్స్ నిలుస్తోంది. పశ్చిమ ఆఫ్రికా దేశాలలో గతంలో తలెత్తిన మంకీపాక్స్ వైరస్ జన్యుకణాలను దాదాపుగా పోలి ఉండే మంకీపాక్స్ ఇప్పుడు సోకుతోందని అధికారులు గుర్తించారు. అర్జెంటీనాలో మంకీపాక్స్ వైరస్ సోకినట్లు నిర్థారణ అయిన వ్యక్తుల పూర్వాపరాలను స్థానిక అధికారులు వెల్లడించలేదు. వారు ఆరోగ్యంగానే ఉన్నారని, వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స జరిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
2 Monkeypox cases registered in Argentina