Monday, December 23, 2024

నీట్ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వైద్య ప్రవేశ పరీక్ష నీట్-యుజి 2024 ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి బీహార్ రాజధాని పాట్నాలో ఒక అభ్యర్థితోసహా ఇద్దరు వ్యక్తులను సిబిఐ అరెస్టు చేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 11కి చేరుకుందని అధికారులు మంగళవారం తెలిపారు.

నీట్ అభ్యర్థి సన్నీని నలందలో, మరో అభ్యర్థి తండ్రి రంజిత్ కుమార్‌ను గయలో సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. నీట్‌యుజి పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు బీహార్‌లో 8 మందిని, మహారాష్ట్రలోని లాటూరు, గుజరాత్‌లోని గోద్రా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుంచి ఒక్కరేసి చొప్పున మొత్తం 11 మందిని సిబిఐ అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News