Monday, December 23, 2024

అయోధ్య గుడిలోకి త్వరలో మరో 2 విగ్రహాలు

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం ట్రస్ట్ వద్ద రామ్ లల్లా పాలరాతి విగ్రహం

అయోధ్య : మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా కృష్ణ శిల విగ్రహం (22న) అయోధ్యలోని బృహత్ ఆలయంలోని గర్భగుడిలోకి ఇప్పటికే ప్రతిష్ఠాపన కాగా మరి రెండు విగ్రహాలు ఆలయంలోని ఇతర ప్రదేశాలకు చేరుకోవలసి ఉన్నది. వాటిలో ఒకటైన పాలరాతి విగ్రహాన్ని రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయణ్ పాండే చెక్కారు. ఆలయం గర్భ గుడిని చేరుకోని ఆ విగ్రహం ఫోటో ప్రముఖ ఆంగ్ల టివి చానెల్ వద్ద ఉన్నది.

ఆ విగ్రహాన్ని రామ మందిరంలోనే మరొక ప్రదేశానికి చేర్చనున్నారు. ఆ పాలరాతి విగ్రహం ప్రస్తుతం ట్రస్ట్ వద్ద ఉన్నది. బంగారు విల్లు, బాణం పట్టుకున్న రామ్ లల్లా విగ్రహం అది. శ్రీ విష్ణువు వివిధ అవతారాలను సూచించే చిన్న శిల్పాలను ఆ విగ్రహం వెనుక అర్ధ వర్తులాకారంలో పొందుపరిచారు. విగ్రహం కొలతలు ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించిన ట్రస్ట్ నిర్దేశించిన ప్రకారం ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News