Monday, January 20, 2025

హైదరాబాద్ లో మరో రెండు కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

కరోనా మళ్లీ పడగ విప్పుతోందా? ఈ ప్రశ్నకు అవుననేదే సమాధానంగా కనబడుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్1… నిశ్శబ్దంగా విస్తరిస్తున్నట్లుగా అధికార యంత్రాంగం అనుమానిస్తోంది. నిన్నటివరకూ హైదరాబాద్ లో ఆరు కేసులు వెలుగు చూశాయి. తాజాగా గురువారంనాడు మరో రెండు కేసులు బయటపడ్డాయి. ఫీవర్ ఆస్పత్రిలో సేకరించిన నమూనాల్లో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు.  జినోమ్ సీక్వెన్స్ కోసం ఈ నమూనాలను పుణెకు పంపించారు.

కరోనా కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, పదేళ్లలోపు పిల్లలు, మహిళలు, వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News