Friday, November 22, 2024

బ్రజేష్ ట్రిబ్యునల్‌కు మరో ఇద్దరు నిపుణులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల పంపిణీ సమస్యలను పరిష్కరించే ప్రక్రయలో వేగం పెంచుతున్నారు. కృష్ణానదిలో జల ప్రవాహాలను ఖచ్చితంగా అంచనా వేసి నివేదిక ఇచ్చేందుకు కేంధ్ర జల్‌శక్తిశాఖ జలవనరుల రంగానికి చెందిన ఇద్దరు నిపుణులను నియమించింది. కృష్ణానదీయాజమాన్య బోర్డులో ఛైర్మన్‌గా పనిచేసి రిటర్ అయిన ఎస్.కె.శ్రీవాస్తవతోపాటు, కేంద్ర జలవనరుల సంఘంలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన రవిశంకర్‌లను ట్రిబ్యునల్‌లో జలవనరుల అంచనా అధికారులుగా నియమించింది. తెలంగాణ, అంధప్రదేశ్ రాష్ట్రాల మధ్యన కృష్ణాజలాలను పంపిణీ చేసేందుకు నియమించిన జస్టిస్ బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్ర పభుత్వం 2022ఆగస్ట్ ఒకటి వరకూ పెంచుతూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపద్యంలో ట్రిబ్యునల్‌కు అవసరమైన ఇద్దరు జలవనరుల రంగం నిపుణుల నియామకంతో ఇక విచారణ ప్రక్రియలో వేగం పెరగనుందని అధికారులు వెల్లడించారు.

2 more water experts appointed in Brijesh Tribunal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News