Thursday, January 23, 2025

పంజాబ్ సరిహద్దుల్లో రెండు పాక్‌డ్రోన్ల కూల్చివేత

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్ :పంజాబ్ లోని అంతర్జాతీయ సరిహద్దులో అమృత్‌సర్ జిల్లా ప్రాంతంలో శుక్రవారం రాత్రి పాకిస్థాన్‌కు చెందిన రెండు డ్రోన్లను భద్రతా దళాలు కూల్చివేశాయి. భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ఇవి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. వీటిలో ఒకదానిలో అనుమానాస్పద మత్తు పదార్ధాలు ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఉధర్ దరివాల్ నుంచి ఒక డ్రోనును, రతన్ ఖుర్ద్ గ్రామం నుంచి మరో డ్రోనును స్వాధీనం చేసుకున్నామని బిఎస్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు. రెండో డ్రోనులో 2.6 కిలోల రెండు హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News