అహ్మదాబాద్: గుజరాత్‌కు చెందిన కచ్ జిల్లాలోని భారత్-పాక్ సరిహద్దుల వద్ద రెండు పాకిస్తానీ చేపల పడవలను సరిహద్దు భద్రతా దళం(బిఎస్‌ఎఫ్) సిబ్బంది గురువారం స్వాధీనం చేసుకున్నారు. హరామీ నాలా బ్యాక్ వాటర్స్ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తానీ మత్సకారులు బిఎస్‌ఎఫ్ గస్తీ సిబ్బందిని చూడగానే తమ పడవలను వదిలి పాక్ సముద్ర జలాల సరిహద్దుల వైపు పారిపోయారని బిఎస్‌ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. పడవలలో చేపలు పట్టడానికి ఉపయోగించే సామగ్రి, వలలు లభించాయని, అనుమానాస్పద వస్తువులేవీ అందులో లేవని ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల రీత్యా హరామీ నాలా ప్రాంతంలోకి భారతీయ మత్సకారులకు సైతం ప్రవేశం నిషిద్ధం. అయితే..మత్ససంపద కోసంం పాకిస్తానీ మత్సకారులు తరచు ఈ ప్రాంతంలోకి చొరబడుతుంటారు. గత నెలలో ఇదే ప్రాంతంలోకి చొరబడిన నలుగురు పాకిస్తానీ మతకారులను అరెస్టు చేసిన బిఎస్‌ఎఫ్ 10 పడవలను స్వాధీనం చేసుకుంది.
గుజరాత్‌లో 2 పాక్ చేపల పడవలు స్వాధీనం
- Advertisement -
- Advertisement -
- Advertisement -