Monday, December 23, 2024

అఫ్గానిస్థాన్‌లో మూడోసారి భూకంపం.. ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్‌ను భూకంపాలు వీడడం లేదు. ఆదివారం మరోసారి పశ్చిమ అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంపలేఖినిపై 6.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. హెరాత్ నగరానికి 34 కిలో మీటర్ల దూరంలో దాదాపు 8 కిలో మీటర్ల ఉపరితలం కింద ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపానికి తీవ్రంగా గాయపడిన దాదాపు వందమంది హెరాత్ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారని డాక్టర్లు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని హెరాత్ ప్రావిన్స్ లోని అత్యవసర సహాయ బృందం అధినేత మొహమ్మద్ జహీర్ నూర్జాయి చెప్పారు. అక్టోబర్ 7న ఇక్కడ సంభవించిన భూకంపంలో హెరాత్‌లో గ్రామాలకు గ్రామాలే చిన్నాభిన్నం అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News