Friday, April 11, 2025

గంగా నదిలో పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు

- Advertisement -
- Advertisement -

గంగా నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన బీహార్ రాష్ట్రం మానేర్ లోని మహావీర్ తోలా గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో గల్లంతైనవారి కోసం రెస్క్యూ బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.

ఈ ప్రమాదంపై మానేర్ స్టేషన్ హెడ్ సునీల్ కుమార్ భగత్ మాట్లాడుతూ..  ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కొంతమంది రైతులు తమ కూరగాయలను పడవలో తీసుకెళ్తుండగా.. వారు మహావీర్ తోలా ఘాట్ వద్దకు చేరుకోగానే పడవ బోల్తా పడింది. ఇద్దరు వ్యక్తులు మినహా మిగిలిన వారు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రమాద సమయంలో బోటులో 10, 12 మంది ఉన్నారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News