Wednesday, January 22, 2025

చేపల వేటకు వెళ్లి మృత్యు ఒడిలోకి..

- Advertisement -
- Advertisement -

చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు సీతారామ కాలువలో పడి మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఇ. రాజేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని అంజనాపురం గ్రామ శివారులోని సీతారామ ప్రాజెక్టు కాలువలో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈక్రమంలో ఒకరు కాలువలో పడగా, అతనిని రక్షించడానికి ఇంకొకరు వెళ్లి ఇద్దరూ కాలువలో పడి మృతి చెందారు. మృతులను కొత్తగూడెంలోని గాంధీనగర్‌కి చెందిన జమీరుద్దీన్ (37), షేక్ రియాజ్ (17)గా గుర్తించారు.

మృతులు జమీరుద్దీన్‌కు భార్య షాహిన్ , ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తెనాలికి చెందిన షేక్ రియాజ్‌కు తల్లి పర్వాన్, తండ్రి కరిమిల్ ఉన్నారు. ఈ సంఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందడంతో వెంటనే పాల్వంచ సిఐ వినయ్‌కుమార్, ఎస్‌ఐ రాజేష్ తమ సిబ్బందితో సంఘటన స్థ్ధలానికి చేరుకుని సీతారామ ప్రాజెక్టు కాలువలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాలను వెలికితీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News