Wednesday, January 22, 2025

జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఇంటర్వ్యూ.. ఇద్దరు డిఎస్పీలు సస్పెండ్

- Advertisement -
- Advertisement -

గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యవహారంలో ఇద్దరు డిఎస్పీలు సస్పెండ్ అయ్యారు. 2023లో లారెన్స్‌ బిష్ణోయ్‌ పంజాబ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడంపై ఆ రాష్ట్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. దీనిపూ విచారణ జరిపిన తర్వాత ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీలు) సహా ఏడుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.

కాగా, లారెన్స్ బిష్ణోయ్ జైలు నుంచే తను అనుకున్న పనులు చేయించుకుంటున్నారు. అందులో భాగంగా ఇటీవల రాజకీయ నాయకుడు, హీరో సల్మాన్ ఖాన్ స్నేహితుడు సిద్దిఖీ బాబాను హత్య చేశారు. ఆయనను హత్య చేసింది తామే అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యిది. ఈ ఘటనపై ముంబై పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News