Monday, January 20, 2025

హైదరాబాద్ శివార్లలో దారుణం.. సెటిల్మెంట్‌కు పిలిచి కాల్చేశారు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగర శివార్లలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లు రఘునందన్, శ్రీనివాస్ రెడ్డిలను సెటిల్మెంట్‌కు పిలిచి వారిపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన నఘునందన్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సెటిల్మెంట్‌కి పిలిచి తమపై తుపాకీతో కాల్పులు జరిపారని రఘునందన్ తెలిపాడు.

అయితే, చికిత్స పొందుతూ రఘునందన్ మృతిచెందాడు. కాల్పులకు పాల్పడిన మట్టారెడ్డి, హఫీజ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2 Shot Dead at Karnamguda in Ibrahimpatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News