Wednesday, April 16, 2025

సికింద్రాబాద్‌ లో విషాద సంఘటన.. అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్‌ పరిధిలోని కార్ఖానాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వీణ(60), మీనా(59) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లోకి వెళ్లి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల క్రితమే వారిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, వారి చావుకు కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News