Thursday, December 26, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాముల కలకలం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం రేపాయి. సోమవారం ఎయిర్‌పోర్టులో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులకు ఊహించని షాక్ తగిలింది. తనిఖీలు చేస్తున్న సమయంలో ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద పాములు చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇవాళ ఉదయం బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు మహిళల దగ్గర విష పాములను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందుతులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News