- Advertisement -
తన ఇద్దరు కొడుకులను దారుణంగా నరికి చంపింది ఓ కసాయి తల్లి. ఈ దారుణ సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. జీడిమెట్లలో నివసిస్తున్న ఓ మహిళ.. ఏడు సంవత్సరాల లోపు వయసున్న తన ఇద్దరు కుమారులను కొడవలితో దారుణంగా నరికి చంపింది. అనంతరం భవనం పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -