Tuesday, January 7, 2025

అంతర్జాతీయ విద్యార్థులకు 2 ప్రత్యేక కేటగరీ వీసాలు

- Advertisement -
- Advertisement -

ఇస్టూడెంట్ వీసా, ఇస్టూడెంట్‌ఎక్స్ వీసాలు
ప్రారంభించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ : దేశంలోని విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించాలని భావిస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రత్యేక కేటగరీ వీసాలు ప్రారంభించింది. ‘ఇస్టూడెంట్ వీసా’ను, ‘ఇస్టూడెంట్‌ఎక్స్’ వీసాను కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిందని, అభ్యర్థులు అందరూ ప్రభుత్వం ప్రారంభించిన ‘స్టడీ ఇన్ ఇండియా’ (ఎస్‌ఐఐ) పోర్టల్‌ను ఉపయోగించవలసి ఉంటుందని అధికారులు తెలియజేశారు. ఎస్‌ఐఐ పోర్టల్‌లో నమోదు చేసుకున్న అర్హులైన విదేశీ విద్యార్థులు ఇవిద్యార్థి వీసా సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని, ఇవిద్యార్థి వీసాలు ఉన్నవారిపై ఆధారపడినవారికి ఇవిద్యార్థిఎక్స్’ వీసా ఆఫర్ చేస్తున్నారని వారు తెలిపారు.

భారత్‌లో దీర్ఘ కాలిక లేదా స్వల్ప కాలిక కోర్సులు చదవాలని అభిలషించే అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశ ప్రక్రియకు ఎస్‌ఐఐ పోర్టల్ వీలు కల్పిస్తున్నది. విద్యార్థులు ‘ఇండియన్‌వీసా ఆన్‌లైన్.గవ్.ఇన్’ పోర్టల్‌పై ప్రత్యేకంగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవలసిన అవసరం ఉంటుంది. అయితే, వారి దరఖాస్తు సాధికారతను ఎస్‌ఐఐ ఐడి ద్వారా తనిఖీ చేస్తారు. అందువల్ల ఎస్‌ఐఐ వెబ్‌సైట్ ద్వారా భారతీయ ఉన్నత విద్యా సంస్థలకు విద్యార్థులు దరఖాస్తు చేయడం తప్పనిసరి అవుతుందని అధికారులు తెలియజేశారు. ఎస్‌ఐఐ భాగస్వామ్య విద్యా సంస్థలు దేని నుంచైనా అడ్మిషన్ ఆఫర్ అందుకున్న తరువాత వీసా కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు పేరు, దేశం, జనన తేదీ, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి వివరాలు రాయవలసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News