Friday, December 20, 2024

బెంగళూరులో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అన్న విద్యార్థులపై కేసు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కాలేజ్ వేడుకల సందర్భంగా ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినదించినందుకు బుక్ అయ్యారు. ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ‘ఇంటర్‌కాలేజ్ ఫెస్ట్’ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు విద్యార్థులు తమ ఐపిఎల్ క్రికెట్ టీమ్స్‌కు అనుకూలంగా నినాదాలు చేసారు. అదే సమయంలో ఓ బాలుడు, బాలిక (ఇద్దరు మైనర్లే) ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినదించారు. దానికి వేరే విద్యార్థులు అభ్యంతరం చెప్పగా వారు తగ్గారు. అయితే ఇదంతా వీడియో తీసిన మరో విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో దాన్ని అప్‌లోడ్ చేశాడు. దాంతో ఆ వీడియో వైరల్ అయింది. చివరికి కాలేజ్ యాజమాన్యం విచారణ చేపట్టి ఆ ఇద్దరి నుంచి క్షమాపణ కోరడమే కాక, వారిద్దరిని సస్పెండ్ కూడా చేసింది. ఇండియన్ పినల్ కోడ్‌లోని సెక్సన్లు 153, 505(1)బి ప్రకారం వారిపై కేసు కూడా నమోదు చేశారు. పోలీసులు ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News