Monday, January 20, 2025

అమెరికాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: అమెరికాలోని చికాగో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేటలో నివాసం ఉండే జేఎన్‌టీయూ ప్రొఫెసర్ పద్మజారాణి చిన్న కుమారుడు పిచెట్టి వంశీకృష్ణ (23), అతని స్నేహితుడు పవన్ స్వర్ణ (23)లతో పాటు డి.కళ్యాణ్, కె.కార్తీక్, ఉప్పలపాటి శ్రీకాంత్‌లు కారులో గురువారం తెల్లవారు జామున ఉదయం 4.15 గంటలకు పిక్నిక్‌కు వెళుతుండగా అలెగ్జాండర్ కౌంటి వద్ద వీరి కారుకు ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పిచెట్టి వంశీకృష్ణ, పవన్ స్వర్ణలు అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న మరో ముగ్గురు స్నేహితులకు గాయాలు అయ్యాయి. పిచెట్టి వంశీకృష్ణ మృతి చెందడంతో నిజాంపేటలోని ఆయన నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

2 Telangana Students died in road accident in US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News