Wednesday, January 22, 2025

కుల్గాం ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

2 Terrorists killed in Kulgam Encounter

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో సోమవారం భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు చెప్పారు. కుల్గాం జిల్లా ట్రబ్జు ఏరియాలో ఉగ్రవాదుల ఉనికి ఉందన్న సమాచారం తెలియడంతో భద్రతా దళాలు నౌపొర ఖేర్‌పొర ప్రాంతంలో గాలింపు చేపట్టారు. గాలింపు చర్యలు ఎన్‌కౌంటర్‌గా మారాయని, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.

2 Terrorists killed in Kulgam Encounter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News