Wednesday, January 22, 2025

కొనసాగిన ఎన్‌కౌంటర్… పాకిస్థానీ కీలక ఉగ్రవాది హతం

- Advertisement -
- Advertisement -

రాజౌరీ : జమ్ముకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఓ కీలక ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని పాకిస్థాన్‌కు చెందిన క్వారీగా గుర్తించినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. లష్కరే తొయిబా (ఎల్‌ఇటి)లో అతడు ఉన్నతస్థాయి ఉగ్రనేత అని, పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడని తెలిపాయి. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్ రెండో రోజు గురువారం కూడా కొనసాగుతున్నట్టు పేర్కొన్నాయి.

‘ పాక్‌అఫ్గాన్ సరిహద్దుల్లో ఉగ్ర శిక్షణ పొందిన క్వారీ లష్కరే తొయిబాలో హై ర్యాంకు కలిగిన నాయకుడు. గత ఏడాది కాలంగా తన బృందంతో కలిసి రాజౌరీపూంచ్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. డాంగ్రీ, కాండీ దాడుల వెనుక సూత్రధారి అతడే. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని మళ్లీ ప్రేరేపింప చేయడానికి అతడిని పంపినట్టు తెలుస్తోంది. పేలుడు పదార్ధాల తయారీలోనే కాదు, గుహల్లో దాక్కొని ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించడంలో ఆరితేరాడు. శిక్షణ పొందిన స్నైపర్ కూడా ” అని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా రాజౌరీ లోని కాలాకోట్ అడవుల్లో భద్రతా బలగాలకు , ఉగ్రవాదులకు మధ్య బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు కెప్టెన్లు, ఒక హవల్దార్, ఒక జవాను వీరమరణం పొందారు. మరో మేజర్ , జవాను గాయపడ్డారు. బాజిమాల్ ప్రాంతంలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక, పోలీస్ బలగాలు రంగం లోకి దిగడంతో భీకర కాల్పులు జరిగాయి. ఈ పరిస్థితి లోనే నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి నిలిచిపోయిన ఎన్‌కౌంటర్ గురువారం మళ్లీ ప్రారంభమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News