Monday, December 23, 2024

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చారు. సోఫియా జిల్లాలోని అల్షిపోరా  ప్రాంతంలో లష్కర్-ఇ- తొయిబాకు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, స్థానిక  పోలీసులతో కలిసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News