Monday, December 23, 2024

పంద్రాగస్టు ముందు ఉగ్ర కలకలం

- Advertisement -
- Advertisement -

2 thousand bullets seized in Delhi six arrested

ఢిల్లీలో 2వేల తూటాల స్వాధీనం, ఆరుగురి అరెస్టు

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో భారీ విధ్వసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో ఆయుధాలు, మందుగుండు సా మగ్రిని అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురిని పోలీసు లు అరెస్టు చేశారు. వారినుంచి పెద్ద ఎత్తున తూటాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాత్య్ర దినోత్సవ వేళ ఉగ్రదాడులు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆనంద్ విహా ర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులు ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారినుంచి 2వేలకు పైగా తూటాలను స్వాధీ నం చేసుకున్నారు. ఈ తూటాలను లక్నోకు తీసుకెళ్తున్నట్లు ఢిల్లీ తూర్పు రేంజ్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ విక్రమ్‌జిత్ సింగ్ చెప్పారు.

ప్రస్తుతం మీరట్ జైల్లో ఉన్న అనిల్ అనే గ్యాంగ్‌స్టర్‌కు ఈ ఆపరేషన్‌తో సం బంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జాన్‌పూర్‌లో ఉంటున్న సద్దాం అనే వ్యక్తి కోసం అనిల్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న తుపాకుల దుకాణంనుంచి ఈ తూటాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఆరుగురిలో తుపాకుల దుకా ణం యజమాని కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో క్రిమినల్ నెట్‌వర్క్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ ఉగ్ర కోణాన్ని వారు తోసిపుచ్చడం లేదు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా రెండు భారీ బ్యాగులు తీసుకువెళుతున్నట్లు ఈ నెల 6న ఆనంద్ విహార్‌లోని ఓ ఆటోడ్రైవర్ పోలీసు కానిస్టేబుల్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసు లు ఆ ఇద్దరిని అరెస్టు చేసి తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిని రషీద్, అజ్మల్‌గా గుర్తించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు గన్‌హౌస్ యజమానిపరీక్షిత్ నేగిని అరెస్టు చేశారు. నేరస్థులకు అతను అనేక సార్లు తూటాలను విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.

డ్రోన్ హల్‌చల్

ఇదిలా ఉండగా కోల్‌కతాలోని చారిత్రక విక్టోరియా మె మోరియల్‌వద్ద డ్రోన్ కలకలంరేపింది. విక్టోరియా మె మోరియల్ వద్ద డ్రోన్ ఎగరడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది దాన్ని కూల్చివేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. ఈ ఇద్దరిని బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి జిల్లాకు చెందిన మహమ్మద్ షిఫాత్, మహ్మద్ జిల్లూర్ రహమాన్‌గా గుర్తించారు. వీరిద్దరూ విక్టోరియా మెమోరియల్ ఫస్ట్‌ఫ్లోర్ బాల్కనీ ఉత్తరం వైపునుంచి కెమెరాలు బిగించిన డ్రోన్ ద్వారా విక్టోరియా మెమోరియల్, దాని పరిసరాలను ఫోలోలు తీస్తున్నట్లు గుర్తించారు. డ్రోన్‌ను ఎగురవేయడానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు. ఫోటోలు తీయడం వెనుక కుట్ర ఏదయినా దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News