Monday, December 23, 2024

ఆర్‌బిఐ ఆఫీస్‌లకు పోస్టు ద్వారా రూ.2 వేల నోట్లను పంపొచ్చు

- Advertisement -
- Advertisement -

బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్‌గా క్రెడిట్ అవుతాయి: రిజర్వు బ్యాంక్

న్యూఢిల్లీ : రూ.2 వేల నోట్లను ఇకపై ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) కార్యాలయాల్లో డిపాజిట్ చేసేందుకు మరో సౌకర్యం కల్పిస్తున్నట్టు రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ఆర్‌బిఐ ఆఫీస్‌లకు బీమా చేసి న పోస్టు ద్వారా రూ.2 వేల నోట్ల ను పంపొచ్చని, దీంతో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అవుతాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఆర్‌బిఐ కార్యాలయాలకు దూరంగా ఉన్నవారికి ఈ అవకాశం ఉచితమని అధికారులు తెలిపారు. దీంతో పాటు బ్యాంకు ఖాతాల్లో రూ.2000 నోట్ల ను డిపాజిట్ చేసేందుకు ప్రజలకు ఆర్‌బిఐ టిఎల్‌ఆర్ (ట్రిపుల్ లాక్ రిసెప్టకుల్) ఫామ్‌ను ఆఫర్ చేస్తోంది.

ఆర్‌బిఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పి.దాస్ మాట్లాడుతూ, వినియోగదారులను ప్రోత్సహించే క్రమంలో రూ.2 వేల నోట్లను బీమా చేసిన పోస్టు ద్వారా ఆర్‌బిఐ కార్యాలయాలకు పంపించే సురక్షిత మార్గాన్ని అం దిస్తున్నామని అన్నారు. దీని ద్వా రా ఆర్‌బిఐ ఆఫీస్‌లకు ప్రయాణించే సమయాన్ని ఆదా చేస్తుందని, అలాగే క్యూలో నిలబడే బా ధ ఉండదని అన్నారు. టిఎల్‌ఆ ర్, పోస్టు ద్వారా ఈ రెండు అవకాశాలు కల్పిస్తున్నామని, ఇవి ఎంతో సురక్షితమైనవి అని అన్నా రు. ఒక్క ఢిల్లీ కార్యాలయమే 700 టిఎల్‌ఆర్ ఫామ్‌లను అందుకుందని ఆయన వివరించారు. మే 19న ఆర్‌బిఐ ఈ రూ.2000 నోట్లను రద్దు చే సింది. అప్పటి నుంచి బ్యాంకుల్లో ఈ నోట్లు దా దాపు 97 శాతం వెనక్కి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News