Monday, December 23, 2024

బోరుబావి చిన్నారి కథ విషాదాంతం

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిపోయిన రెండున్నరేళ్ల చిన్నారిని రక్షించడానికి అధికారులు రెండు రోజులుగా ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు ఆమెను వెలికి తీసినా ఆస్పత్రికి తరలించిన తరువాత చనిపోయినట్టు ప్రకటించారు. మంగళవారం బోరుబావిలో పడిన ఆ చిన్నారిని రక్షించడానికి సహాయక చర్యలు గురువారం వరకు కొనసాగాయి. గురువారం సాయంత్రం ఆమెను బయటకు తీయగలిగారు. తక్షణం ఆస్పత్రికి వైద్యచికిత్స కోసం తరలించారు. కానీ ఊపిరాడక ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు. సెహార్ జిల్లా ముంగావళీ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం రెండున్నరేళ్ల చిన్నారి లోతైన బోరు బావిలో పడిపోయిన విషయం తెలిసిందే.

తొలుత ఆ పాప 20 అడుగుల లోతులో చిక్కుకు పోగా, తరువాత 40 అడుగుల లోతుకు జారిపోయింది. వర్షం, ఈదురుగాలులకు తోడు, రాతినేల కావడంతో డ్రిల్లింగ్ ప్రకంపనలకు చిన్నారి మరింత కిందికి జారిపోతుండడం సిబ్బందికి సవాలుగా మారింది. పైపు ద్వారా చిన్నారికి ఆక్సిజన్ అందించారు. 52 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. గురువారం రోబోటిక్ నిపుణులు కూడా రంగం లోకి దిగారు. చివరకు 100 అడుగుల లోతు లోంచి పాపను బయటకు తీయగలిగారు. కానీ పాప మాత్రం ప్రాణాలతో దక్కలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News