Monday, December 23, 2024

బోరుబావిలో మరింత లోతుకు జారిన చిన్నారి…

- Advertisement -
- Advertisement -

సెహోర్ : మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో ప్రమాదవశాత్తు బోరు బావిలో జారి పడిన రెండేళ్ల చిన్నారి బుధవారం మరింత లోతుకు జారిపోయినట్టు అధికారులు గుర్తించారు. ముంగావలీ గ్రామంలో బయట ఆడుకుంటూ 300 అడుగుల లోతైన బావిలో రెండేళ్ల చిన్నారి పడిపోయింది. అప్పటి నుంచి గత 24 గంటలుగా ఆపరేషన్ శృష్టి పేరుతో బోరు బావికి సమాంతరంగా తవ్వడం ప్రారంభించారు. తవ్వడం ప్రారంభించేటప్పుడు సుమారు 30 అడుగుల లోతులో చిన్నారి ఉన్నట్టు గుర్తించారు. అయితే డ్రిల్లింగ్ చేయడంతో మరో 50 అడుగుల లోతుకు బాలిక జారిపోయినట్టు గుర్తించారు. అది రాతి నేల కావడంతో చిన్నారిని కాపాడడం కష్టంగా మారిందని, తవ్వుతున్న కొద్దీ ఆ పాప కిందకి జారి పోతోందని జిల్లా కలెక్టర్ ఆశీశ్ తివారీ మీడియాకు వెల్లడించారు.

ఆమెకు ఆక్సిజన్ అందిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఆ చిన్నారిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బోర్‌బావి చుట్టూ డ్రిల్లింగ్ చేయడం వల్ల ఆపరేషన్ మరింత క్లిష్టంగా మారిందని ఎస్‌పి మయాంక్ అవస్తీ చెప్పారు. ప్రకంపనల వల్ల పాప మరింత కిందకు జారుతోందని, దీంతో ప్రస్తుతం డ్రిల్లింగ్ ఆపేయాలని నిర్ణయించామన్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సంఘటనపై ఆరా తీశారు. తన సొంతజిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని , చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News