Sunday, January 12, 2025

మల్కాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఇద్దరు యువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బుధవారం జిల్లాలోని పెద్ద శంకరంపేట్‌ మండలం మల్కాపూర్‌లో బైక్ పై దూసుకొచ్చిన ఇద్దరు యువకులు అదుపుతప్పి అంబేడ్కర్‌ విగ్రహం ఫెన్సింగ్‌ను ఢీకొట్టారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News