- Advertisement -
న్యూఢిల్లీ: దేశం లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 20.16 కోట్లకు పైగా మిగిలిన, ఇంకా ఉపయోగించని కొవిడ్ టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. ఇప్పటివరకు 192.27 కోట్ల కంటే ఎక్కువ డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రభుత్వం అందించిందని తెలియజేసింది. దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసింది. టీకాల లభ్యతను బట్టి డ్రైవ్‌ను ముమ్మరంగా వేగవంతం చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
- Advertisement -