Thursday, January 23, 2025

మూడు రాష్ట్రాల్లో జెఎన్.1 సబ్‌వేరియంట్ 20 కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ 19 ఉపరకం జేఎన్.1 కు సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 20 కేసులు గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పరిధి లోని ఇండియన్ సార్స్‌కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. గోవాలో అత్యధికంగా 18, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున ఈ జెఎన్.1 రకం కేసులు నమోదైనట్టు తెలిపింది. కొన్ని రోజుల క్రితమే వెలుగు చూసిన ఈ జేఎన్.1 వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే దేశ వ్యాప్తంగ కరోనా మళ్లీ పడగ విప్పుతోంది.

కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్క రోజే 614 కేసులు , మూడు మరణాలు నమోదయ్యాయి. మే 21 తరువాత ఈ స్థాయిలో మొదటిసారి కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో దేశంలో కొవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య 2311కు చేరింది. దీంతో అన్ని రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ వ్యాప్తిపై ప్రస్తుతం ఆందోళన అక్కర లేకపోయినా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సన్నద్ధతపై మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు.

నాలుగు దేశాల్లో కొత్త వేరియంట్ : డబ్లుహెచ్‌ఒ
కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 ఇప్పటికే అనేక దేశాల్లో వెలుగు చూసినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్‌తోపాటు భారత్ లోనూ ఈ కేసులు నమోదైనట్టు తెలియజేసింది. ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ గా పేర్కొన్న డబ్లుహెచ్‌వో , ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని, పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్.1 తోపాటు ఇతర వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా గత వారం రోజుల్లో సింగపూర్‌లో 56 వేల కొవిడ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News