Monday, January 20, 2025

ట్రోలింగ్ చేస్తే చిక్కులు తప్పవు.. పోలీసుల హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

ట్రోలింగ్ ఛానళ్లపై 20 కేసులు నమోదు

హైదరాబాద్: ప్రజాప్రతినిధులపై ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు పాల్పడుతున్న ట్రోల్ ఛానళ్లపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝలిపించారు. మొత్తం 20 కేసులు నమోదుచేసి ఈ ఛానళ్ల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ సబ్‌స్ర్కైబర్లను పెంచుకుని టిఆర్‌పి ద్వారా డబ్బు సంపాదించుకునే ఉద్దేశంతో కొందరు ప్రజాప్రతినిధులపై అభ్యంతరకర, పరువునష్టం కలిగించే విధంగా కంటెంట్‌ను, మార్ఫింగ్ చేసిన వీడియోలను కొందరు యువకులు పోస్ట్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇటువంటి చర్యలు ఐపిసి, ఐటి చట్టం కింద శిక్షార్హమైనవని వారు చెప్పారు.

విజయనగరంకు చెందిన అట్టాడ శ్రీనివాసరావు నిర్వహిస్తున్న ట్రోలర్‌కుర్రాడు@టోలర్‌కుర్రాడు308, కడపకు చెందిన సిరసనిమణికంట నిర్వహిస్తున్న మాసబ్బాయి@మాసబ్బాయి, నిజామాబాద్‌కు చెందిన బద్దన్ జె శ్రవణ్ నిర్వహిస్తున్న ఎంకమ్మ ట్రోల్స్, వరంగల్‌కు చెందిన మోటం శ్రీను నిర్వహిస్తున్న తెలుగు ట్రోల్స్ న్యూ, కృష్ణా జిల్లాకు చెందిన పెరక నాగవెంకట జ్యోతి కిరణ్ నిర్వహిస్తున్న చింటూ ట్రోల్స్, జగిత్యాలకు చెందిన వడ్లూరి నవీన్ నిర్వహిస్తున్న బంతిపువ్వు ట్రోల్స్, కరీంనగర్‌కు చెందిన కొల్లి చంద్రశేఖర్ నిర్వహిస్తున్న చందూ ట్రోల్స్, కడపకు చెందిన బిల్లా శ్రీకాంత్ నిర్వహిస్తున్న చెవిలోపువ్వు ఛానళ్లను గుర్తించడం జరిగిందని, వారికి సెక్షన్ 41(ఎ) కింద నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు.

వివివిధ ప్రజాప్రతినిధులపై అభ్యంతరకర వీడియోలను, కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్న ట్రోలింగ్ ఛానళ్లపై ఇప్పటివరకు 20 కేసులు నమోదు చేశామని, 8 మంది వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ ట్రోలర్లలో చాలామంది 20 నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న యువకులేనని, ఇంకా చదువుకుంటున్న వారు, చదువు మధ్యలోనే మానేసిన వారు వీరిలో ఉన్నారని పోలీసులు వివరించారు. వారు చేస్తున్న ఈచట్టవ్యతిరేక చర్యల వల్ల వారి భవిష్యత్తు నాశనమవుతుందని కూడా పోలీసులు హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News