Monday, December 23, 2024

మెదక్ మున్సిపాలిటీకి రూ.20 కోట్లు, టియూఎఫ్‌ఐడిసి ద్వారా మంజూరు

- Advertisement -
- Advertisement -
  • మంత్రి కెటిఆర్, మంత్రి హరీశ్‌రావులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే

మెదక్: మెదక్ మున్సిపాలిటీకి 20 కోట్లు, టియూఎఫ్‌ఐడిసి ద్వారా మంజూరు చేసిన పురపాలక మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్‌రావులకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… మున్సిపాలిటీలో అవసరం ఉన్న చోట ఔట్ లెట్స్, డ్రైన్, సిసి రోడ్స్, రోడ్ల మరమ్మత్తులు చేయాలని కోరారు. ఎంఎన్ కెనాల్ పొంగిపొర్లడం వలన సాయినగర్ కాలనీలో వరద నీళ్లు వచ్చాయని వచ్చే సంవత్సరం నాటికి కాలనీలోకి నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చేసేలా చర్యలు చేపడతామన్నారు. వర్షాకాలం వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను ప్రజలంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మెదక్ నియోజకవర్గంలో ఏడు డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని అన్నారు. ప్రస్తుతం వారిఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

మెదక్ పట్టణంలో నాయక్‌చెరువు ప్రమాద హెచ్చరిక ఉందని వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెరువులు, కుంటలు, తూములు, డ్యామేజ్ ఉంటే ఇరిగేషన్‌అధికారులదృష్టికి తీసుకెళ్లాలని వారు అప్రమత్తంగా ఉండాలని నిర్లక్షంగా ఉండకూడదని సూచించారు.పాత ఇండ్లలో ఎవరు ఉండకూడదని కూలిపోయే ప్రమాదం ఉంటుందని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. అలాగే కూలిపోయిన ఇళ్లకు తక్షణమే ఇల్లు నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ జయరాజ్, మెదక్ ఆత్మకమిటీచైర్మన్ అంజాగౌడ్, రైతుబందు అధ్యక్షుడు కిష్టయ్య, నాయకులు గడ్డమీది కృష్ణగౌడ్, రాగి అశోక్, లింగారెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News