Tuesday, January 7, 2025

పసి బాలుడి ప్రాణం తీసిన వీధి కుక్కలు

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: నిండు నూరేళ్లు నిండక ముందే ఆ పసిపాలుడు వీధి కుక్కల దాడికి బలైపోయాడు. ఈ సంఘటన శంషాబాద్ మున్సిపాలిటీ, ఆర్‌జిఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిన్నారి తండ్రి సూర్య కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… సూర్య కుమార్ కుటుంబంతో కలిసి శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహాల వద్ద గల సామా ఎంక్లేవ్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ఏడాది వయసు గల ఒక కుమారుడు నాగరాజు, 20 రోజుల వయసు కలిగిన రెండో కుమారుడు ఉన్నారు. బుధవారం రాత్రి తల్లితో కలిసి గుడిసెలో పడుకున్నారు.

అర్ధరాత్రి నాగరాజు పాల కోసం ఏడవడంతో తండ్రి డబ్బాలో పాలు ఇచ్చి పడుకోబెట్టాడు. అయితే కొద్దిసేపటి తర్వాత వీధి కుక్కలు బాలుడిని గుడిసె నుంచి బయటకు తీసుకెళ్లి దాడి చేయడంతో బాలుడు చనిపోయాడు. అయితే బాలుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు గుడిసె వద్దకు వచ్చి సూర్యప్రకాష్‌కు సమాచారం అందించారు. బాబును చూసిన సూర్యప్రకాశ్ చనిపోయిన బాబు తన కుమారుడు నాగరాజు అని సూర్య కుమార్ బోరున విలపించాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News