Sunday, December 22, 2024

ముప్పు.. మునక

- Advertisement -
- Advertisement -

20 dead in different accidents in Telangana

రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో 20మంది దుర్మరణం

పలుచోట్ల
హోలీ
పండుగల్లో
విషాదం..
రోడ్డు
ప్రమాదాల్లోనూ
మృత్యువాత

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్ : రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20మంది మృత్యువాతపడ్డారు. ప్రమాదాల్లో యువకులు ఎక్కువగా దుర్మరణం పాలయ్యారు. అతివేగమే ప్రమదాల కు కారణంగా కన్పిస్తోంది. హోలీ వేడుకల నేప థ్యంలో మితిమీరిన వేగం, అపై అనువుకాని చో ట స్నానాలకు వెళ్లడంవల్లే ఇలా యువత మృ త్యువు బాట పడ్డారు. హోలీ వేడుకల్లో పాల్గొని స్నేహితు లతో కలిసి స్నానానికి వెళ్లి కాల్వపడి గల్లంతైన సంఘటన నల్లగొండ జిల్లా కొండమ ల్లేపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. గు ర్రంపోడుకు చెందిన చేపూరి లాలయ్య- కుమారు డు మహేశ్ (25) చిన అడిశర్లపల్లిలో ఉంటూ కొండమల్లేపల్లిలో మొబైల్ షాపులో పని చేస్తున్నా డు. హోలీని పురస్కరించుకుని స్నేహితులతో కలి సి సంబారాలు జరుపుకుని అనంతరం స్నేహితు లతో కలిసి అక్కంపల్లి రిజర్వాయర్ కాలువలో స్నానానికి వెళ్లారు. రిజర్వాయర్ కాలువలో పై భాగంలో రెండు గేట్లు తీసి ఉండడం.. వరద ప్రవాహం ఎక్కువగా ఉండం.. అదేసమయంలోమహేష్ కాల్వకి దూకడంతో గల్లంతయ్యాడు. పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకుని మృతదేహాం కోసం గాలింపు చేపట్టారు.

కోట్‌పల్లి ప్రాజెక్టులో పడి ఆటో డ్రైవర్ మృతి

ప్రమాదవ శాత్తు కోట్‌పల్లి ప్రాజెక్ట్‌లో పడి యువకుడు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం గడ్డమీది గంగారం గ్రామానికి చెందిన దోమ గోపాల్ (25) అటో డ్రైవర్. హోలీ సంబురాలు ముగించుకొని సమీపంలోని కోట్‌పల్లి ప్రాజెక్టులో స్నానం చేసేందుకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నరేందర్ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య అక్షర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.

మంగపేట వద్ద గోదావరిలో యువకుడి గల్లంతు

గోదావరిలో యువకుడు గల్లంతయ్యాడు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కార్తీక్ అనే యువకుడు హోలీ అనంతరం గ్రామ సమీపంలోని గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లి నదీ ప్రవాహంలో గల్లంతయ్యాడు.

రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురి మృతి

వరంగల్ జిల్లా కేసముద్రం ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హోలి వేడుకల్లో పాల్గొని వెళ్తుండగా రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. హోలి పూట మృతుల ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ పెద్దలు మరణించడంతో మృతుల ఇంట రోదనలు మిన్నంటాయి. స్థానిక విలేజ్ కట్టుకాలువ ప్రాంతానికి చెందిన మృతులు ఆంగోతు నర్సింహా (40), భూక్యా తరుణ్‌లు పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి మార్కెట్ వైపు వస్తుండగా.. కేసముద్రం స్టేషన్‌కు చెందిన చిదురాల నరేష్ (25) తన పెదనాన్న కుమార్తె శ్రావ్యతో కలిసి మార్కెట్ వైపు నుంచి వెళ్తుండగా.. ఫ్లైఓవర్‌పై రెండు బైక్‌లు వేగంతో ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రావ్యకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఆంగోతు నర్సింహ హైదరాబాద్‌లో పనిచేస్తూ రెండు రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. భూక్యా తరుణ్‌కు ఏడాది క్రితమే వివాహం అయ్యింది. మరో వ్యక్తి చిదురాల నరేష్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఘటనా స్థలికి వచ్చిన ఎస్సై రమేష్‌బాబు, తిరుపతి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ములుగు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, ఐదుగురికి గాయాలు

కార్లు, బైక్ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ములుగు మండలం ఇంచర్ల గ్రామ ఎర్రిగట్టమ్మ దేవాలయ సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. హనుమకొండ నుంచి ఏటూరునాగారంవైపు వెళ్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొనడంతోపాటు.. అదేదారిలో వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టాయి. ఈ క్రమంలో కార్ల వెనుక వైపు నుంచి వస్తున్న మరో కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి.

నారాయణపురంలో ట్రాక్టర్ బొల్తా.. డ్రైవర్ సహా ముగ్గురు మృతి

ట్రాక్టర్ బొల్తాపడి డ్రైవర్ సహా ముగ్గురు మృతిచెందిన ఘటన నల్లగొండ జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామంలో ఎపీలోని విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు ఇటుక బట్టీలలో పనిచేస్తున్నారు. శుక్రవారం డ్రైవర్, నలుగురు కూలీలు కలిసి ఇటుక లోడుతో మునుగోడు మండలం పలివెల గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా నారాయణపురం మండలం ఎర్రగుంట గ్రామ శివారుకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో బొల్తా పడింది. దీంతో డ్రైవర్ ఎల్లయ్య(50), కూలీలు గౌరీ(28), సీతారాం(32) అక్కడికక్కడే మృతిచెందగా, ట్రాక్టర్‌లో ఉన్న సూరిబాబు, దుర్గమ్మకు గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లయ్యకు గుండెపోటు రావడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని, ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తి తెలిపారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

టేకులపల్లి స్నానాకి వెళ్లి యువకుడు మృతి

అప్పటివరకు సరదాగా హోలీ ఆడుకుని స్నానానికి వెళ్ళిన యువకుడు వాగులో దిగి మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెదిన గుగులోత్ స్వామి(22) స్నేహితులతో కలిసి హోలీ వేడుకల తర్వాత సమీపంలో లాలు తండా వద్ద వున్న చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా లోతును గమనించక పోవడంతో మునిగి పోయాడు. వెళ్లిన ఎవరికి ఈత రాకపోవడంతో అతనిని బయటకు తీసుకురావడానికి సాహసించలేదు. సమీపంలో ఉన్న వ్యక్తి వచ్చి నీటిలోకి దిగి మునిగిపోయిన స్వామిని బయటకు తీసుకువచ్చాడు. కానీ, అప్పటికే అతను మృతి చెందాడు.

మణుగూరు రేగులగండిలో వ్యక్తి గల్లంతు

రేగులగండి చెరువులో పడి వ్యక్తి గల్లంతైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని కూనవరంలో చోటుచేసుకుంది. కూనవరం గ్రామానికి చెందిన బత్తుల రాంబాబు స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో గడిపి సమీపంలోని రేగులగండి చెరువులోకి దిగగా రాంబాబు(35) గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న మణుగూరు సిఐ ముత్యం రమేష్, ఎస్‌ఐలు పురుషోత్తం ఘటనా స్థలికి చేరుకోని గాలింపు చర్యలు చేపట్టారు.

తెల్లవాగులో స్నానానికి వెళ్లి బాలుడి మృతి

హోలీ అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని పెనుబల్లిలో గద్దలమడుగు వాగులో స్నానానికి వెళ్లిన అఖిల్(14) మృతి చెందాడు. నలుగురు స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లి మృత్యువాతపడ్డాడు. రుద్రంపూర్‌లోని ఎస్‌ఆర్‌టి ప్రాంతానికి బొజ్జ సంపత్ కుమారుడు అఖిల్. ఈతకు వెళ్లిన నలుగురిలో ఎవరికి ఈత రాదని సమాచారం. వాగులో లోతు ఎక్కువగా ఉండటంతో మృతిచెందాడు.

బైక్‌ను ఆర్‌టిసి బస్సు ఢీకొని ఇద్దరు దుర్మరణం

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్‌టిసి బస్సు బైక్‌ను ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. జైపూర్ మండలం రామరావుపేట, ఇందారం ప్రాంతాలకు చెందిన ప్రసాద్(34), నరేష్ (32) అనే ఇద్దరు యువకులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హోలీ పండుగ రోజు ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

కెనాల్‌లో పడి యువకుడి మృతి

బోధన్ జిల్లా పెంటాకలాన్ గ్రామానికి చెందిన సుధాకర్ (22) అనే యువకుడు హోలీ సంబురాల తర్వాత సమీపంలోని ఎడపల్లి మండలం జాన్కంపేట కెనాల్‌లో స్నానానికి దిగి నీట మునిగి మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని పోలీసులు స్థానికుల సహాయంతో తీయించి బోధన్ ఆసుపత్రికి తరలించారు.

క్వారీగుంటలో పడి బాలుడు మృతి

ప్రమాద వశాత్తు ఓ బాలుడు క్వారీ గుంటలో పడి మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. యంనంపేట్ కెఎస్‌ఆర్ కంపనీలో పనిచేస్తున్న రాయచూర్ ప్రాంతానికి చెందిన వి. రాజు కుమారుడు వి.నరేంద్ర (15) హోలీ పండగ తర్వాత స్నేహితులతో పరిసరాల్లోని క్వారీ గుంతలో స్నానాకి వెళ్లి ఈత రాక నీటిలో మునిగి మరణించాడు. మృతుడు నరేంద్ర బైక్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు.

గచ్చిబౌలిలో కారు బీభత్సం

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో మరోసారి కారు బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. గచ్చిబౌలి ఎల్లా హోటల్ సమీపంలో వేగంగా దూసుకువచ్చిన ఎపి28 సిఎల్ 1134 నంబర్ గల కారు అదపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకువెళ్లింది. అక్కడ రోడ్డు మధ్యలో చెట్లకు నీరు పెడుతున్న మహేశ్వరమ్మ అనే మహిళను కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో మహేశ్వరమ్మ అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోగా, కారులో ఉన్న రోహిత్, గాయత్రీలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హూటాహుటిన చికిత్స నిమిత్తం ఎఐజి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఈ ఇద్దరు మృతి చెందారు. కారు నడుపుతున్న వ్యక్తి కూకట్‌పల్లికి చెందిన రాహుల్‌గా గుర్తించారు. యువకుడు మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరకున్నారు. పూర్తిగా ధ్వంసమై రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న కారును క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధ్దరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News