Monday, December 23, 2024

20 మంది ఐపిఎస్‌ల బదిలీ

- Advertisement -
- Advertisement -

డిజిపిగా రవి గుప్తా కొనసాగింపు
అంజనీ కుమార్, సివి ఆనంద్‌లకు పోస్టింగ్స్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భారీగా ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ డిజిపిగా రవిగుప్తాను కొనసాగిస్తూ, ఇటీవల ఇసి వేటు వేసిన అంజనీ కుమార్, సివి ఆనంద్‌లకు కూడా పోస్టింగ్స్ ఇచ్చింది. తెలంగాణ డిజిపిగా రవిగుప్తా, ఎసిబి డిజిగా సీవీ ఆనంద్, జైళ్ల శాఖ డిజిగా సౌమ్యా మిశ్రా, రోడ్ సేఫ్టీ డిజిగా అంజనీ కుమార్, సెంట్రల్ జోన్ డిసిపిగా శరత్ చంద్ర , అప్పా డైరెక్టర్‌గా అభిలాష్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి, టిఎస్‌పిఎస్‌సి డిజిగా అనిల్ కుమార్, రైల్వే డిజిగా మహేష్ భగవత్,
హోంగార్డ్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ హౌసింగ్ బోర్డ్ అడిషనల్ డైరెక్టర్‌గా ఎం రమేష్, సిఐడి చీఫ్‌గా శిఖా గోయల్, ఎస్‌ఐబీ చీఫ్‌గా సుమతి, సిఐడి డిఐజిగా రమేష్ నాయుడు, కార్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సిపిగా సత్యనారాయణ,పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎండిగా రాజీవ్ రతన్, మల్టీజోన్ ఐజీగా తరుణ్ జోషి, ఎసిబి డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్, పర్సనల్స్ ఐజీగా చంద్రశేఖర్ రెడ్డిలు నియమితులయ్యారు.
14 మంది ఐఎఎస్‌లకు పదోన్నతులు
రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పించింది. ఈ పదోన్నతులు 2024 జనవరి1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రమోషన్ పొందిన వారిలో రమేలా సత్పతి, అనురాగ్ జయంతి, గౌతమ్ పాత్రు, రాహుల్ రాజ్, భావేష్ మిశ్రా,సత్య శారదాదేవి, నారాయణ రెడ్డి, ఎస్.హరీష్, జి.రవి, కె.నిఖిల,అయేషా మష్రత్ ఖానమ్, సంగీత సత్యనారాయణ, యాసీన్ బాషా, వెంకట్రావ్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News