Thursday, January 23, 2025

బ్రిడ్జి పైనుంచి కిందపడిన బస్సు: 20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మక్కా: దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హజ్‌యాత్రికులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆసిర్ ప్రావిన్స్ ప్రాంతంలో అకబాట్ షార్ రోడ్డులో వెళ్తుండగా బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో బ్రిడ్జి పిట్ట గొడను ఢీకొట్టి అనంతరం కింద పడింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది సజీవదహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన 29 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఖామిష్ ముషట్క్ నుంచి అభా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అకబాట్ రోడ్డు 11 టన్నెల్స్, 32 బ్రిడ్జిలు ఉన్నాయి. వివిధ దేశాలకు చెందిన హజ్ యాత్రికులు మక్కాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News