Wednesday, January 22, 2025

రైతులకు రూ. 20 లక్షల కోట్ల రుణాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగంలో వినూత్న మార్పుల దిశలో పలు పథకాలను ప్రకటించారు. ఓ వైపు వ్యవసాయ రంగాన్ని డిజిటల్ సమాచార అనుసంధానం చేయడం, మరో వైపు వ్యవసాయ రుణాల పరపతి లక్షాన్ని రూ 20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇది ఇంతకు ముందటి రుణాల మొత్తంతో పోలిస్తే 11 శాతం ఎక్కువ . ఈ మేరకు ఆర్థిక సంవత్సరంలో రుణాలను కల్పించే దిశలో చర్యలు తీసుకుంటారు. దేశ వ్యవసాయ రంగ ప్రగతిలో భాగంగా సంబంధిత రంగంలో డిజిటల్ టెక్నాలజీల విస్తరణ, సహజసిద్ధ సేద్యం ప్రోత్సహించడం, గ్రామీణ స్టార్టప్ కంపెనీల ఆరంభానికి నిధులను సమకూర్చడం వంటి ప్రతిపాదనలు చేశారు. సంబంధిత దిశలో వ్యవసాయ రంగ ప్రోత్సాహక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు, దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ సంబంధిత స్టార్టప్‌ల ఆరంభానికి వీలు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

బహిరంగ వనరులు, వ్యవసాయంలో డిజిటల్ ప్రక్రియ ప్రవేశపెట్టడం ద్వారా రైతులు కేంద్రీకృతంగా వ్యవసాయ, మార్కెట్ సంబంధిత సమగ్ర సమాచారం తెలుసుకునేందుకు వీలేర్పడుతుంది, ఇంటర్నెట్ ఇతరత్రా సమాచార వేదికల నుంచి రైతులు తమకు అందుబాటులోకి వచ్చే డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మేలైన సాగుపద్ధతులను ఎంచుకునేందుకు, తద్వారా తమ దిగుబడులకు సరైన మార్కెటింగ్ వనరులు సరైన గిట్టుబాటు ధరలు అందుబాటులోకి వచ్చేందుకు మార్గం ఏర్పడుతుందని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు. ఏ ఏ పంటలను ఎప్పుడెప్పుడు ఏ విధంగా వేయాల్సి ఉంటుంది? ఇదే దశలో వ్యవసాయ సంబంధిత సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌లకు మద్దతు కల్పించడం వంటి అంశాలకు ఇప్పుడు ప్రభుత్వం సమకూర్చే ప్రోత్సాహక నిధితో వీలేర్పడుతుందని వివరించారు. వ్యవసాయం దేశంలో స్థూల విలువల ఆధారిత (జివిఎ) సూచీలో 15 శాతంగా ఉంటూ, అత్యధిక స్థాయి ఉపాధి కల్పన దిశలో ఉందని పేర్కొన్న ఆర్థిక మంత్రి సబ్సిడీలతో కూడిన రుణాల కేటాలు మొత్తాన్ని రూ 20 లక్షల కోట్ల టార్గెట్‌గా ఎంచుకుంటున్నట్లు తెలిపారు.

ప్రత్యేకించి పశు సంరక్షణ, పాల ఉత్పత్తుల పెంపుదల సంబంధిత డెయిరీ రంగం, మత్స రంగం అభివృద్ధికి కృషి చేస్తారు. రైతుల ఉత్పత్తుల నిల్వలకు సరైన వికేంద్రీకరణ ఏర్పాట్లు ఉంటాయి. పలు ప్రాంతాలలో గిడ్డంగుల ఏర్పాటు ద్వారా రైతులు తమకు గిట్టుబాటు ధరల వరకూ పంటలను నిల్వచేసుకునేందుకు అవసరం అయిన వికేంద్రీకరణ పద్ధతుల స్టోరేజ్ సౌకర్యం పొందుతారు. దేశంలో తృణధాన్యాల దిగుబడిని పెంచుతారు. ఈ దిశలో హైదరాబాద్‌లోని మిల్లెట్ ఇనిస్టూట్‌ను నైపుణ్య పాటవ శక్తిని పెంచే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తగు సాయం అందిస్తారు. స్పల్పకాల పంట రుణాలను 7 శాతం వడ్డీరేట్లకు అందిస్తారు. చిన్న సన్నకారు రైతులకు ష్యూరిటీల్లేని రుణపరిమితిని ఇప్పుడున్న రూ 1 లక్ష నుంచి రూ 1.6 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News