Sunday, December 22, 2024

పంజాగుట్టలో 20 లక్షల హవాలా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

20 lakh hawala cash seized in Panjagutta

పంజాగుట్ట: హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 20 లక్షల హవాలా నగదు పట్టిబడింది. సోమాజిగూడ నుండి పార్క్ హయత్ హోటల్ రోడ్ మీదిగా ఓ కారులో వెళుతుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వెంకటేశ్వర్లు, మహేశ్వర్ రెడ్డి లను అదుపులోకి తీసుకున్నారు. జితేందర్ కుమార్ అనే వ్యక్తి వెంకటేశ్వర్లు ద్వారా 20 లక్షల నగదు తరలిస్తుండగా పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర్లు, మహేశ్వర్ రెడ్డి కర్మాంఘాట్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. నగదు సంబంధించి ఎలాంటి వివరాలు, ధృవపత్రాలు లేకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News